calender_icon.png 6 December, 2025 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేములవాడలో అగ్నిప్రమాదం..

06-12-2025 12:00:00 AM

70 క్వింటాళ్ల పత్తి దగ్ధం

వేములవాడ, డిసెంబర్ 05,(విజయక్రాంతి):రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ పట్టణంలోని భగవంతరావు నగర్లో శు క్రవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. యాదవ సంఘం సమీపంలో ఉన్న పెరుగు జలంధర్ ఇంట్లో నిల్వ ఉంచిన 6070 క్వింటాళ్ల పత్తి మంటల్లో పూర్తిగా దగ్ధమైంది.ఇంట్లో షార్ట్సర్క్యూట్ కారణంగా అకస్మాత్తుగా మంటలు చెలరేగగా, పత్తి అధికంగా ఉండటంతో అగ్ని మంటలు వేగంగా వ్యాపించాయి.

సంఘటన సమయంలో కుటుంబ సభ్యులు బయట ఉండటం వల్ల ప్రాణనష్టం తప్పింది.స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది వెంటనే చేరుకొని మంట లు చుట్టుపక్కల ఇళ్లకు వ్యాపించకుండా గంటపాటు శ్రమించి అదుపులోకి తీసుకువచ్చారు. పత్తి దగ్ధంతో రైతు జలంధర్ కుటుంబానికి లక్షల్లో నష్టం జరిగినట్లు అంచనా.ప్రమాదంతో తీవ్రంగా నష్టపోయిన సదరు బాధిత రైతు కుటుంబానికి ప్రభుత్వం వెంటనే సహాయం అందించాలని స్థానికులు, ప్రజా సంఘాల వారు కోరుతున్నారు.