calender_icon.png 26 October, 2025 | 1:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అపార్ట్‌మెంట్‌లో ఫైర్ డీజీపీ తనిఖీలు

26-10-2025 12:00:00 AM

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 25 (విజయక్రాంతి): ఫైర్ విభాగం డీజీపీ విక్రమ్‌సింగ్ మాన్ శనివారం తెల్లాపూర్‌లోని 40 అంతస్తుల ఎత్తున అపార్ట్‌మెంట్‌లో హై-రైజ్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్‌ను తనిఖీ చేశారు. భవనంలోని అగ్నిమాపక వ్యవస్థల పనితీరును పరిశీలించారు. భవనంలో ఏర్పాటు చేసిన ఫైర్ పంప్‌లు, స్ప్రింక్లర్ సిస్టమ్స్, స్మోక్ డిటెక్టర్లు, మాన్యువల్ కాల్ పాయింట్లు, అత్యవసర నిష్క్రమణ మార్గాలు ఎమర్జెన్సీ ఎగ్జిట్లు వంటి వ్యవస్థల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు.

అత్యంత కీలకమైన ఫైర్ పంప్ రూమ్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, దాని లైవ్ ఫుటేజీని ఫైర్ కమాండ్ సెంటర్‌కు అనుసంధానించాలని సూచించారు. గుండెపోటు వంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడేందుకు, భవనంలోని ము ఖ్యమైన ప్రదేశాలలో ఏఈడీలను ఏర్పా టు చేసి, వాటి వినియోగంపై సిబ్బందికి శిక్షణ ఇవ్వాలన్నారు. బిల్డింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఫైర్ కమాండ్ రూమ్‌ను అనుసంధానించి, పర్యవేక్షించాలని ఆదేశించారు.