calender_icon.png 23 July, 2025 | 11:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాజాపై ఆగని ఇజ్రాయెల్ దాడులు

23-07-2025 12:29:42 AM

24 గంటల్లో 63 మంది మృతి

గాజా సిటీ, జూలై 22: గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది. తా జాగా జరిపిన దాడుల్లో గత 24 గంటల్లో 63 మంది పాలస్తీనియన్లు మరణించినట్టు ఆరోగ్య శాఖ ధ్రువీకరించింది. ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు గాజాలోని డేర్ ఎల్‌ఛీ ప్రాంతాల్లోకి  తొలిసారి ప్రవేశిం చాయి. మంగళవారం తెల్లవారుజామున గాజాపై  ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఇప్పటివరకు యుద్ధంలో మృతి చెందిన వారి పాలస్తీనియుల సంఖ్య 59 వేలు దాటినట్టు తెలుస్తోంది.

దాదాపు 1.42 లక్షల మంది క్షతగాత్రులయ్యారు. మరోవైపు గా జాలో ఎటువైపు చూసినా ఆకలి ఆర్తనాదాలే వినిపించాయి. అన్నం కోసం పడిగాపులు కాస్తున్న గాజా వాసులపై ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు, తుపాకీ గుళ్లతో దాడికి పాల్పడుతోందని డబ్ల్యూఎఫ్‌ఓ పే ర్కొంది. గాజాలో ఆహారం నిండి ఉన్న వాహనాల కాన్వాయ్ వై పు దూసుకెళ్లిన పాలస్తీనా జన సమూహంపై ఆదివారం జరిపిన దాడిలో 80 మంది మృతి చెందడం గమనార్హం.