calender_icon.png 17 October, 2025 | 4:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పటాకుల దుకాణం @ 23,400

17-10-2025 12:00:00 AM

  1. జిల్లా కేంద్రంలో అక్రమ దందా
  2. నిబంధనలు గాలికి.. నిధులు జేబులోకి
  3. సిండికేట్‌గా మారిన నలుగురు వ్యాపారులు
  4. డిపార్ట్మెంట్ల పేరు చెప్పి ఆర్థిక దోపిడీ
  5. ధరలు పెంచిన దుకాణదారులు

నిర్మల్, అక్టోబర్ 1౬ (విజయక్రాంతి): నిర్మ ల్ జిల్లా కేంద్రంలో తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్న పటాకుల దందా కొందరికి కాసులు కురిపిస్తుంది. దీపావళి పండుగ నేపథ్యంలో పటాసులను అమ్ముకునేందుకు మునిసిపల్ శాఖ ద్వారా నిర్వహించిన టెండర్లు నలుగురు సిండికేట్ గా ఏర్పడి అక్రమాలకు తెర లేపారు. నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినిస్ట్రీలో పటాసులను అమ్ముకునేందుకు ఏర్పాటుచేసి దుకా ణాల టెండర్లు పెద్ద ఎత్తున అక్రమ దందా నడుస్తున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు.

పట్టణంలో పటాసుల విక్రయా నికి ఇద్దరికీ మాత్రమే లైసెన్సు ఉండగా తాత్కాత్రిక లైసెన్స్‌ల జారీ ప్రభుత్వ అనుమతులు పటాసుల దుకాణం షెడ్లు ఏర్పాటు ఫైర్ సేఫ్టీ తదితర పనుల కోసం మున్సిపల్ శాఖ టెండర్లను వేసింది. పట్టణంలోని నారాయణరెడ్డి మార్కెట్ శాస్త్రి నగర్ బుధవార్ పేట్ర కాలనీ చెందిన  నలుగురు వ్యక్తులు సిండికేట్‌గా ఏర్ప డి ఒక్కొక్క దుకాణానికి 23,400 టెండర్లు దక్కించుకున్నారు.

గత ఏడాది 16 లక్షల మాత్ర మే ఉండగా ఈసారి ఏడు లక్షలు 7, అదనంగా టపాసుల దుకాణాలపై భారం మోపడంతో సీజనల్ వ్యాపారం చేసే చిన్న చిన్న వ్యాపారు లు తీవ్రంగా నష్టపోతున్నారు. పట్టణంలో ఎన్టీఆర్ మినీ స్టేడియంలో 60 దుకాణాలకు అను మతి ఇచ్చారు.

రేకుల షెడ్లు తాత్కాలిక దుకాణాలను ఏర్పాటు చేసి ఫైర్ సేఫ్టీ మున్సిపల్ అనుమతులు అగ్నిమాపక అనుమతులు రెవి న్యూ పోలీస్ శాఖ అనుమతుల పేరుతో సదరు వ్యాపారులు పటాసుల దుకాణాల వద్ద నుంచి అధిక మొత్తంలో వసూలు చేస్తున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు

వారు నిర్ణయించిందే ధర.. 

నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ లో టపాసుల దుకాణాల నిర్వహణ నిబంధనలు గాలికి వదిలి నిధుల దోపిడీ లక్ష్యంగా అటు కాంట్రాక్టర్లు అధికారులు వివరించిస్తున్న తీరుపై పట్టణ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు టపాసుల ధరలు పెరిగిన నేపథ్యంలో వ్యాపా రం అంతంత మాత్రమే ఉంటున్న తరుణంలో దుకాణాల నిర్వహణలో వారు నిర్ణయించిందే ధర అనే రీతిలో కొనసాగుతున్న అధికారులు వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టకపోవడంపై విమర్శలు వినవస్తున్నాయి.

టెండర్లు దక్కించుకున్న వారు తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేసి లైసెన్సుల జారీ ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు అయ్యే ఖర్చు ఒక్కొక్క దుకాణానికి పదివేలకు మించి కానప్పటికీ 23,400 వసూలు చేయడంపై ఉపాధి పొందుతున్న చిరు వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. దుకాణాల ఏర్పా ట్లు డబ్బులు వసూలు చేస్తున్న టెండర్ దారు లు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం లేదు.

నిబంధనల ప్రకారం జనావాసాల కు దూరంగా దుకాణాలు ఏర్పాటు చేయాలి దుకాణాల మధ్య మీటర్ వెడల్పు ఎడబాటు ఉంచాలి. ఫైర్ సేఫ్టీ పరికరాలను అందుబాటులో ఉంచాలి ఇసుక ఏర్పాటు చేయాలి. ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పాఠాన్నించాలి. పార్కింగ్ స్థలం ఉండాలి.

లైసెన్సు ఉన్న దుకాణాల నుంచి పటాకులు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. గోదాములు ఊరు బయట ఏర్పాటు చేసుకోవాలి. కానీ ఈ నిబంధనలు ప్రతి ఏటా ఎక్కడ అమలు కాకపోయినా పోలీసు రెవెన్యూ మున్సిపల్ ఫైర్ సేఫ్టీ అధికారులు నిబంధన అమలుపై కఠిన చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వినవస్తున్నాయి

డిపార్ట్మెంట్ల పేరుతో  అక్రమాలు

నిర్మల్ పట్టణంలో టపాసుల దుకాణం కేటాయింపులో అక్రమాలు జరుగుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. కొందరు లైసెన్సులు లేకుండానే రాజకీయ పలుకుబడిని ఉపయోగించి అక్రమంగా దుకాణాలు పెడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు. దుకాణా ల కోసం టెండర్లు దక్కించుకున్న నలుగురు దుకాణాల నిర్వహణకు వ్యాపారానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే డిపార్ట్మెంట్ అధికారుల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి.

దుకాణందారుడు తాము డిమాండ్ చేసిన నగదు చెల్లిస్తే సరి లేదంటే మున్సిపల్ అగ్నిమాపక పోలీసులకు సమాచారం అందించి ఆ దుకాణాన్ని సీజ్ చేసే విధంగా వెనుక ఉండి ప్రోత్సహిస్తున్నారని విమర్శలు వినవస్తున్నా యి. పటాసుల దుకాణం వద్ద ఎలాంటి నిబంధనలు లేకపోయినా అధికారులు వాటి జోలికి వెళ్లకపోవడంపై భారీ ఎత్తున లోపాయికర ఒప్పందాలు ఉన్నట్టు చిరు వ్యాపారులే పేర్కొంటున్నారు. ఈసారి దుకాణాల నిర్వహణకు 7 లక్షల రుసుమును పెంచడం వల్ల వ్యా పారం చేసే వారు ఆందోళన చెందుతున్నారు.

ఈ భారాన్ని వినియోగదారులపై రుద్ది ఎందు కు వారు సిద్ధం కావడంతో ఈసారి టపాసుల రేట్లు 20% పెరిగినట్టు కొందరు చెబుతున్నా రు. ఇప్పటికే కొందరు తమిళనాడు మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి తపాసులను హోల్సే ల్ రూపంలో కొనుగోలు చేసి ఇక్కడ విక్రయించేందుకు సిద్ధమవుతున్న తీరుణంలో పోలీసు రెవెన్యూ ఫైర్ మున్సిపల్ శాఖలు ఈ అక్రమా ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.