01-07-2025 12:00:00 AM
న్యూయార్క్, జూన్ 30: మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బందిపై ఓ దుండగుడు కాల్పులకు తెగబ డ్డాడు. అమెరికా వాయువ్య రాష్ట్రం ఇడాహోలో ఈ ఘటన చోటుచేసుకుంది. దుండగుడి దుశ్చర్యలో ఇద్దరు అగ్నిమా పక సిబ్బంది మృతి చెందారు. స్థానిక అధికారులు తెలిపిన ప్రకారం.. కూటేనై కౌంటీలోని పర్వత ప్రాంతంలో ఉన్న పా ర్క్‌లో మంటలు అంటుకున్నాయి.
అగ్నిమాపక దళాలు ఘ టనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పుతున్న సమయంలో ఓ దుండగుడు రైఫిల్స్‌తో సిబ్బందిపై కాల్పులకు తెగబ డ్డాడు. అప్రమత్తమయ్యేలోపు వారిలోని ఇద్దరు సిబ్బంది మృత్యువాతపడ్డారు. పర్వత ప్రాంతంలో మంటలు ఇంకా చెలరేగుతూనే ఉన్నాయని..
ఓ వైపు అగ్నిమాపక సిబ్బంది వాటిని అదుపు చేయడానికి ప్రయత్నిస్తుండగా.. మరోవైపు పోలీసులు నిందితుడిని పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టారని అధికారులు పేర్కొన్నారు. పర్వత ప్రాంతంలో పౌరులు కూడా ఉండటంతో మరణాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నట్టు వెల్లడించారు.