calender_icon.png 20 May, 2025 | 5:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్లు విడుదల

13-04-2025 09:30:43 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని ఒకటవ వార్డులో ఆదివారం ఏప్రిల్ 14 నుండి 20 వరకు నిర్వహించనున్న అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్లను మాజీ కౌన్సిలర్ సూరం సంగీత బానేష్ ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది విడుదల చేశారు. అగ్ని నివారణ పట్ల అవగాహన పెంపొందించేందుకు, అగ్నిప్రమాదాల్లో అమరులైన వారికి నివాళులర్పించడం కోసం వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక కేంద్రం అధికారి పి. శ్రీనివాస్, ఎల్ ఎఫ్ బి. రవికుమార్, ప్రభాకర్, వేణు, నారాయణ, రేగుల వెంకటి పాల్గొన్నారు.