20-05-2025 05:04:58 PM
ఎమ్మెల్యే మందుల సామేలు..
తుంగతుర్తి (విజయక్రాంతి): తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధికి ప్రస్తుతం 1400 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నట్లు, అభివృద్ధి నా లక్ష్యామని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు(MLA Mandula Samuel) అన్నారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల పరిధిలోని లాక్యా తండా గ్రామంలో మంగళవారం మాజీ జెడ్పిటిసి బానోతు మాన్సింగ్ సోదరుని కుమారుడు సురేష్-అనూష నూతన వధూవరుల వివాహ రిసెప్షన్ అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ వివాహ మహోత్సవానికి తుంగతుర్తి శాసనసభ్యులు మందులు సామెల్, తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ హాజరై అక్షింతలు వేసి నూతన దంపతులను ఆశీర్వదించారు. కొత్త దంపతులు ఒకరికోకరు అన్యోన్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముక్కాల అవిలమల్లు యాదవ్, నాగారం మాజీ జెడ్పిటిసి కడియం పరమేష్, జిల్లా నాయకులు సుంకరీ జనార్ధన్, పోలేపాక రామచంద్రు, పచ్చిపాల సుమతి వెంకన్న, అంజయ్య, లింగన్న, ఎల్లేష్, శ్రీను, కలకోట్ల మల్లేష్, మంగళపల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.