calender_icon.png 20 May, 2025 | 11:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సరస్వతి పుష్కరాల పనులను పరిశీలించిన ధార్మిక సలహాదారు

13-04-2025 09:28:12 PM

మహదేవపూర్,(విజయక్రాంతి): మే నెలలో జరిగే సరస్వతి పుష్కరాల పనులను తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్మిక సలహాదారు గోవిందా హరి పరిశీలించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న సరస్వతి నది పుష్కరాల పనులను ధార్మిక సలహాదారు పరిశీలించి పలు సూచనలు చేశారు. గోవిందా హరి మాట్లాడుతూ సరస్వతి ఘాటు వద్ద సరస్వతి అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసే పనులను మరియు నూతన ఘాట్ నిర్మాణం పనులను పరిశీలించి తగు సూచనలు చేశారు. పనులను త్వరగా పూర్తిచేయాలని అన్నారు. అనంతరం శ్రీ కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయానికి రాగా ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి స్వామివారికి అభిషేకం అమ్మవారి దర్శనం అనంతరం ఈవో మహేష్ ఆధ్వర్యంలో స్వామివారి శేష వస్త్రాలతో సన్మానించారు. అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు పూజారులు వేద పండితులు పాల్గొన్నారు.