20-05-2025 04:35:59 PM
ముంబాయి: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు చివరకు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 873 పాయింట్ల నష్టంతో 81,186 వద్ద, అలాగే నిప్టీ 261 పాయింట్ల నష్టంతో 24,684 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిప్టీ 261.55 పాయింట్లు తగ్గి 24,683.90 వద్ద ముగిసింది. డాలర్ తో పోలిస్తే రూపాయి 21 పైసలు తగ్గి 85.63 కి క్షీణించింది. ఇంట్రాడేలో దాదాపు 1398 షేర్లు లాభపడగా.. మరో 2415 షేర్లు పతనమయ్యాయి.
దీంతో నిప్టీ ఆటో సూచీ 2 శాతానికి పైగా, నిప్టీ బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ షేర్లు 1 శాతానికి పైగా పతనమైంది. మిడ్ క్యాప్ 100 సూచీ 1.62 శాతం, స్మాల్ క్యాప్ సూచీ 0.94 శాతం నష్టపోయాయి. బీఎస్ఈలో నమోదైన కంపెనీల మొత్తం విలువ దాదాపు రూ.3.50 లక్షలు క్షీణించి రూ.440.23 లక్షల కోట్లకు చేరింది.