calender_icon.png 28 November, 2025 | 3:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యాయవాదుల సంక్షేమ సాధనలో ‘మంథని’ కృషి అమోఘం

28-11-2025 12:00:00 AM

నిజామాబాద్ లీగల్ క రెస్పాండెంట్ నవంబర్ 27(విజయ క్రాంతి): న్యాయవాదులుగా వృత్తిలో ఉన్న కొందరికి న్యాయవాదుల సంక్షేమ నిధిలో సభ్యులుగా సభ్యత్వం లేకపోవడం పెద్దలోటేనని, ఆ లోటును తీర్చిన మంచిమనిషి మంథని రాజేందర్ రెడ్డి అని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల సాయరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు రాజేందర్ రెడ్డిని బార్ సమావేశపు హల్ సన్మానించిన అనంతరం ఆయన మాట్లాడారు. న్యాయవాదుల సంక్షేమ నిధిలో సభ్యులుగా చేర్పించిన తీరుతో సంక్షేమ పథకాలు సమప్రధాన్యం లభించిందని అన్నారు.

న్యాయవిద్యలో ఉతీర్ణులైన వారు తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ లో న్యాయవాదులుగా పేరు నమోదు చేసుకుని వివిధ బార్ అసోసియేషన్లలో న్యాయవాద వృత్తిని కొనసాగిస్తారని ఆయన తెలిపారు. కొన్నేళ్ల క్రితం న్యాయవాదులుగా ఉన్న కొందరికి బార్ కౌన్సిల్ నిబంధనలను మేరకు న్యాయవాదుల సంక్షేమ నిధిలో సభ్యులుగా నమోదు కాలేకపోయారని, బార్ కౌన్సిల్ నిబంధనలను సవరణలు చేయించి సంక్షేమ నిధిలో సభ్యులుగా చేర్పించారని సాయరెడ్డి తెలిపారు. సంక్షేమ పథకాలు న్యాయవాదులకు చేరవేయడంలో బార్ కౌన్సిల్ సభ్యునిగా రాజేందర్ రెడ్డి కీలక పత్రాధారిగా నిలిచారని ఆయన పేర్కొన్నారు.

అధికారిక వ్యవస్థలలో మనవారు ఉంటే మనం అనుకున్నవన్నీ అవుతాయని ఆయన అన్నారు.సన్మాన గ్రహీత, తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ న్యాయవాదిగా సహచర న్యాయవాదుల ప్రయోజనాలనే పరమావధిగా పని చేశానని, అందుకు న్యాయవాదుల బలమే ముందుకు నడిపించిందని తెలిపారు.న్యాయవాద వృత్తి విరమణ అనంతరం లభించే పరిహారం పది లక్షలకు పెంచడం సంక్షేమలో కీలకమేనని అన్నారు.

బార్ కౌన్సిల్ సభ్యునిగా ఉన్న తనతో పని చేయించడంలో బార్ ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు పట్టువదలని విక్రమార్కుడిలా పట్టుపట్టి న్యాయవాదుల సంక్షేమ నిధిలో కొందరు న్యాయవాదులను చేర్పించడంలో సఫీలికృతులు కావడానికి కారణభూతుడు అయ్యారని తెలిపారు.మన సంక్షేమం మన చేతలలోనే ఉంటుందని, నిబంధనలు అయిన చట్టాలు అయిన అవసరాలకు అనుగుణంగా మార్చుకోవాలని అన్నారు.

న్యాయవాదుల పని విధానంలో చేదోడువాదోడుగా నిలబడటమే తాను చేశానని ఆయన పేర్కొన్నారు.బార్ ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు మాట్లాడుతూ తనలాంటి వారికి ఎంతోమందికి న్యాయవాదుల సంక్షేమ నిధిలో స్థానం లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు రాజేందర్ రెడ్డి ని పూలమాల, శాలువతో ఘనంగా సన్మానించారు. 

 ప్రభుత్వ న్యాయవాది అమిదాల సుదర్శన్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్పల్లి రాజేష్వర్ రెడ్డి,బార్ ఉపాధ్యక్షుడు సురేష్, సంయుక్త కార్యదర్శి ఝాన్సిరాని, రమాదేవి,మంజిత్ సింగ్, సీనియర్ న్యాయవాదులు కృపాకర్ రెడ్డి, కృష్ణనంద్,జక్కుల వెంకటేశ్వర్, గడుగు గంగాధర్,మధుసుధన్ రావు, నల్లవెల్లి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.