28-11-2025 01:07:09 AM
అశ్వాపురం, నవంబర్ 27 (విజయ క్రాంతి): అశ్వాపురం మండలంలోమత్స్యకారుల ఆర్థికాభివృద్ధి కోసం గురువారం చేప పిల్లల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మత్స్యశాఖ అధికారి ఇంతియాజ్, ఇరిగేషన్ శాఖ డీఈ బి. రమేష్ పాల్గొన్నారు.వీరిరువురూ కలిసి కాకతీయుల కాలం నాటి తుమ్మల చెరువులో చేప పిల్లలను వదిలారు.
అనంతరం వారు మాట్లా డుతూ,మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చేపల పెంప కాన్ని ప్రోత్సహిస్తూ ఉచిత చేప పిల్లల పంపి ణీ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం మత్స్య వృత్తిదారులకు ఎంతో ప్రయోజనకరం. చేపల పెంపకం గ్రామీణ ఆర్థిక వ్యవ స్థకు బలం చేకూరుస్తుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మత్స్యకారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులుపాల్గొన్నారు.