02-01-2026 05:48:12 PM
- శ్రీ శ్రీ దేవనాథ రామానుజ జీయార్ స్వామీ
మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): విద్య అనేది కేవలం డబ్బు సంపాదించడానికి మాత్రమే కాదనీ, అభ్యసించిన చదువును మన వాళ్లకు, మన దేశానికి ఉపయోగపడే విధంగా ఉండాలని శ్రీ శ్రీ దేవనాథ రామానుజ జీయార్ స్వామీ బోధించారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సెవెన్ హిల్స్ హై స్కూల్ లో పదవ తరగతి విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ప్రేరణాత్మక కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
విద్య సంపాదన కోసం, అన్య దేశాలకు పరిగెత్తడం కోసం కాకుండా, దేశం కోసం వినియోగ పడాలన్నారు. పదవ తరగతి వార్షిక పరీక్షలకు ఉపయోగపడే విషయాలను వివరించారు. మానవ జీవితంలో విలువలను నేర్చుకొని పరిపూర్ణమైన జీవితం గడపడానికి పాటుపడాలన్నారు. ట్రస్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు, కోటా గ్రూప్ ఆఫ్ కాలేజెస్ అధ్యక్షుడు అంజి రెడ్డి, వికాస్ తరంగిణి అధ్యక్షుడు హేమంత రావు, సీనియర్ నాయకులు గోనె శ్యామ్ సుందర్ రావు, పాఠశాల హెచ్ఎం గోనె భాగ్యలక్ష్మి, మంచిర్యాల ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులు హాజరయ్యారు.