calender_icon.png 2 January, 2026 | 7:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అదుపుతప్పి ఆటో బోల్తా మహిళ మృతి

02-01-2026 05:55:29 PM

ఆటోలో పలువురికి స్వల్ప గాయాలు

హుజూర్ నగర్/ మేళ్లచెరువు: అదుపుతప్పి ఆటోబోల్తా పడి మహిళా మృతి చెందిన విషాద ఘటన శుక్రవారం మేళ్లచెరువు మండల కేంద్రంలో చోటు చేసుకుంది.  మేళ్లచెరువు గ్రామంలో కోదాడ రోడ్డు పెట్రోల్ బంకు సమీపంలో ఆటో అదుపు తప్పి బోల్తా పడటంతో కోదాడ మండలం గణపవరం గ్రామానికి చెందిన పెంటా వెంకటమ్మ (65) అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... కోదాడ మండలం గణపవరం గ్రామానికి చెందిన వారు  వ్యవసాయ కూలి పనుల నిమిత్తం మేళ్లచెరువుకు ఆటోలో సుమారు 15 మంది కూలీలు ప్రయాణిస్తున్న ఆటో మేళ్లచెరువు ప్రవేశించే సమయంలో పెట్రోల్ బంకు సమీపానికి రాగానే ఆటో నెం.టిజీ 29టి 4835 గల ఆటో ఆకస్మికంగా అదుపు తప్పి రోడ్డుపై బోల్తా పడింది.దీంతో వెంకటమ్మ అక్కడికక్కడే మరణించడంతో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.మిగిలిన వారికి స్వల్ప గాయాలు కావడంతో స్థానికుల సహాయంతో వారిని వెంటనే హాస్పిటల్ కు తరలించారు. దీంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై పరమేష్ తెలిపారు.