calender_icon.png 2 January, 2026 | 7:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజనం అమలు చేయాలి

02-01-2026 05:51:47 PM

ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారావు వెంకటేష్

హుజురాబాద్,(విజయక్రాంతి): ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రామారావు వెంకటేష్ డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ హుజురాబాద్ మండల మహాసభ కేశ బోయిన రాము యాదవ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన వెంకటేష్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగం పట్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని, ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ విద్యార్థుల సంక్షేమపై లేదని, విద్యారంగం సమస్యలతో సతమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యార్థి ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రిష్ చేయాలని లేని పక్షంలో ఉద్యమాల ద్వారా విద్యార్థుల హక్కులు సాధిస్తామని అన్నారు. హుజరాబాద్ నియోజకవర్గం లో గురుకుల పాఠశాల నిర్వాణకు సొంతభవనాలు లేవని, బీసీ సంక్షేమ హాస్టల్, బలికల హాస్టల్ శిధిలావస్థలో ఉన్నాయని వెంటనే ప్రభుత్వం సొంత భవనాలు నిర్మించి నూతన గ్రంధాలయం నిర్మించాలని డిమాండ్ చేశారు. అందాల పోటీ నిర్వహించడానికి ఉన్న నిధులు పేద విద్యార్థులు ఉండే ప్రభుత్వ హాస్టల్ గురుకుల పాఠశాలలకు ఎందుకు వస్తలేవని ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యతిరేక విధానాలను మానుకొని ప్రభుత్వ విద్యారంగా బలోపేతానికి చర్యలు తీసుకోవాలని కోరారు.

వచ్చే రెండు నెలల్లో వార్షికో పరీక్షలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాలు చేయక తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షునిగా నిఖిల్, కార్యదర్శిగా రోహిత్, ఉపాధ్యక్షుడిగా శివాజీ, సహాయ కార్యదర్శిగా అవినాష్,కోశాధికారిగా రాధాకృష్ణ, సభ్యులుగా రషీద్,  లక్ష్మణ్, అంజి, హర్షిత్, వరుణ్, రాము తో పాటు తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.