02-01-2026 05:59:43 PM
బైంసా,(విజయక్రాంతి): బైంసా పట్టణంలో రాబోయే మున్సిపల్ ఎన్నికలకు అధికారులు సంసిద్ధులవుతున్నారు. అందులో భాగంగా శుక్రవారం బైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్ బైంసా పట్టణ ఓటర్ ముసాయిదా మున్సిపల్ కార్యాలయంలో విడుదల చేశారు. పట్టణంలో 26 వార్డులకు గాను వార్డులవారీగామొత్తం ఓటర్లు 51,118 ఓటర్లు ఉండగా 25486 ఓటర్లు పురుషులు, 25623 మహిళా ఓటర్లు, ఇతరులు 9 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. మున్సిపాలిటీ సంతోష్ మేనేజర్ గౌరీష్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు