05-11-2025 06:20:33 PM
పలువురు నాయకుల పూజలు..
భక్తులకు అన్నదానం..
పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు..
తాడ్వాయి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని శబరిమాత ఆశ్రమంలో బ్రహ్మాజీ వాడి శివారులోని సిద్దేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె మదన్ మోహన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ప్రజలందరికీ మంచి జరగాలని భగవంతుణ్ణి పూజిస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన కోరారు.
పంటలు బాగా పండి రైతులు ఆర్థికంగా బలోపేతం కావాలని భగవంతుని ప్రార్థించినట్లు తెలిపారు. శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాణాల లక్ష్మారెడ్డి సిద్దేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ప్రముఖ సైంటిస్ట్, బిజెపి రాష్ట్ర నాయకులు పైడి ఎల్లారెడ్డి సిద్దేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, భక్తులు పాల్గొన్నారు.