18-10-2025 12:45:06 AM
-రూ.50వేల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన హనుమకొండ జిల్లా అధికారిణి, ఫీల్డ్ ఆఫీసర్
హనుమకొండ, అక్టోబర్ 17 (విజయ క్రాంతి): హనుమకొండ జిల్లా మత్స్య శాఖ లో ఇద్దరు ఆఫీసర్లు శుక్రవారం ఏసీబీకి చిక్కారు. ఓ సొసైటీ నుంచి జిల్లా అధికారిణి, ఫీల్డ్ ఆఫీసర్ రూ.50వేల లంచం డిమాండ్ చేసి, రెడ్‌హ్యాండెడ్‌గా దొరికారు. జిల్లా పరిధిలోని మాదన్నపేటకు చెందిన మత్స్య పారి శ్రామిక సంఘం సభ్యత్వం కోసం కొందరు దరఖాస్తు చేసుకున్నారు. వారి పేర్లను సొసైటీలో చేర్చడానికి జిల్లా మత్స్యశాఖ అధికా రిణి నాగమణి, ఫీల్ ఆఫీసర్ హరీశ్ లంచం డిమాండ్ చేశారు.
లంచం ఇవ్వడం ఇష్టం లేక సొసైటీ ప్రతినిధి ఏసీబీ అధికారులను సంప్రదించాడు. మత్స్యశాఖ హనుమకొండ జిల్లా కార్యాలయంలో శుక్రవారం లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండె డ్‌గా పట్టుకున్నారు. జిల్లా అధికారిణి నాగమణి, ఫీల్ ఆఫీసర్ హరీశ్‌ను అదుపులోకి తీ సుకొని ఏసీబీ కోర్టులో హాజరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. అధికారులు లం చం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064 కి కాల్ చేయాలని ఆయన కోరారు. ఎస్సై, కానిస్టేబుళ్లు, సిబ్బంది పాల్గొన్నారు.