18-10-2025 12:46:28 AM
పాలమూరు నేత్ర వైద్యుడు పి.కిశోర్‌కుమార్
మహబూబ్‌నగర్, అక్టోబర్ 17(విజయక్రాంతి): దీపావళి పండు గ సందర్భంగా టపాసులు, ఇతర సామగ్రి కాల్చేటప్పుడు త గు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రఖ్యాత టాపికల్ పాకో సర్జన్, ఐసీఎల్ సర్జన్,మెడికల్ రెటీనా స్పెషలిస్ట్, పాలమూరు కంటి వైద్యశాల డాక్టర్ కిశోర్ కుమార్ సూచించారు. ఈ మేరకు పాలమూరు కంటి వైద్యశాల ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సులో డాక్టర్ ఆయన మాట్లాడారు. కంటికి గాయమైతే చేయాల్సినవి, చేయకూడనివి ఈ సందర్భంగా కిశోర్‌కుమార్ వివరించారు.
టపాసులు కాల్చేటప్పుడు కంటికి గాయం అయితేవెంటనే వైద్య సహా యం పొందాలని సూచించారు. కంటిని మృదువుగా కడగాలని, కం టికి రక్షణ కల్పించాలని, కన్ను నలపకూడదన్నారు. గృహ వైద్యాలు ఉప యోగించకూడదు అన్నారు. కంటి లోపలి తునకలను తొలగించవద్దన్నా రు. గాయానికి నూనె ఇతర క్రీములు పూ యకూడదన్నారు. టపాకాయలు వెలిగించే సమయంలో కేవలం మందంగా ఉన్న నూలు దుస్తులు ధరించాలని, అన్ని దుస్తులనూ బిగుతుగా ఉండేలా చూ సుకోవాల న్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితిలో పాలమూరు కంటి వైద్యశాల హెల్ప్ లైన్ నెంబర్ 91691 73918 లో సంప్రదించాల్సిందిగా డాక్టర్ కిశోర్‌కుమార్ కోరారు.