calender_icon.png 2 September, 2025 | 5:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు

02-09-2025 12:00:00 AM

వాతావరణ కేంద్రం అంచనా

హైదరాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాం తి): వాయువ్య బంగాళాఖాతంలో రానున్న 36 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ర్టంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, మహబూబా బాద్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి.

ఈ మేరకు వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. జనగాం, ఆదిలాబాద్, కామారెడ్డి, జనగాం, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నల్గొండ, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ విడుదల చేసింది.

బుధవారం భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములు గు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, హనుమకొండ, కామారెడ్డి, ఖమ్మం, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యా ల, మెదక్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.