23-06-2025 12:00:00 AM
చండూరు, జూన్ 22 : ఆటోలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుబడిన సంఘటన మండలంలోని కొండాపురం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపే వివరాలు ప్రకారం చండూరు మండల పరిధిలోని గ్రామాల నుంచి రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి అక్రమంగా తరలిస్తున్నారని సమాచారంతో మండలంలోని వివిధ గ్రామాలల్లో తనిఖీలు చేయాగా భువనగిరి మండలం బొల్లేపల్లి గ్రామానికి చెందిన కునుసోత్ కష్ణ టిఎస్ 30 టి 7478 నెంబర్ గల టాటా ఎసి వాహనంలో అక్రమంగా5 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని భువనగిరికి తరలిస్తుండగా కొండపురం గ్రామ శివారులో పోలీసులు పట్టుకున్నారు.
వాహనాన్ని స్వాదీనం చేసుకొని సీజ్ చేశామని,పట్టుబడిన బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులకు అప్పగిస్తామని తెలిపారు. పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసినట్లు చండూరు ఎస్‌ఐ వెంకన్నగౌడ్ తెలిపారు