06-05-2025 12:35:25 AM
వరుస కథనాలతో కదిలిన రెవెన్యూ బృందం
చర్ల, మే 5 (విజయ క్రాంతి):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో గల కలివేరు సమీపం లోని జంగాలపల్లి గ్రామం లో ప్రభుత్వ భూమి సంబంధిత గు ట్టలపై అధికారుల అనుమతులు లేకుండా అక్ర మంగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్న అంశాల పై విజయ క్రాంతిలో ప్రచురితమైన వరుస కథనాలకు ఎట్టకేలకు రెవెన్యూ బృందం కదిలింది. మండల తాసిల్దార్ శ్రీనివాస్ స్పందించారు.
సోమవారం ,సర్వేయర్ భవాని,ఆర్ ఐ రామకృష్ణ సిబ్బందితో కలిసి తెగడ గ్రామ పంచాయతీ పరిధి లోని జంగాలపల్లి గ్రామంలో గుట్టపై ఉన్న ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 60 భూమిని గుర్తించారు , జెసిబి తో తవ్విన తవ్వకాలను తాసిల్దార్ శ్రీనివాస్ దగ్గర ఉండి సిబ్బందితో కొలతలు వేయించి పంజనామ నిర్వహించారు. పంచినామ ఆధారం గా నివేదికను తయారు చేసి పై అధికారులకు పంపిస్తున్నట్లు తాసిల్దార్ ఈ సందర్భం గా తెలియాచేశారు.