calender_icon.png 30 October, 2025 | 10:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జంట జలాశయాలకు పోటెత్తిన వరద

30-10-2025 01:51:35 AM

  1. గేట్లు ఎత్తి మూసీలోకి నీటి విడుదల

హిమాయత్‌సాగర్ నుంచి 3,963 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 29 (విజయక్రాంతి): భారీ వర్షాలకు హైదరాబాద్ జంట జలా శయాలైన ఉస్మాన్‌సాగర్ గండిపేట, హిమాయత్‌సాగర్ నిండుకుండలను తలపిస్తున్నాయి. ఎగువ నుంచి వరద ప్రవాహం పోటెత్తడంతో జలమండలి అధికాలు అప్రమత్తమై రిజర్వాయర్ల గేట్లను ఎత్తి భారీగా నీటిని దిగువన ఉన్న మూసీ నదిలోకి విడుదల చేశారు. హిమాయత్‌సాగర్‌కు ఇన్‌ఫ్లో పెరగడంతో ఔట్‌ఫ్లోను గణనీయంగా పెంచారు. పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 

ఉస్మాన్‌సాగర్: ఉస్మాన్‌సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1,790 అడుగులు, 3.900 టీఎం సీల సామర్థ్యంకాగా, ప్రస్తుత నీటిమట్టం 1,788.95 అడుగులకు, 3.660 టీఎంసీలకు చేరింది. జలాశయంలోకి 2500 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా, అధికారులు 1867 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు.

హిమాయత్‌సాగర్: పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50, అడుగులు 2.970 టీఎంసీలు. ప్రస్తుతం 1762.20 అడుగులు, 2.640 టీఎంసీల వరకు నీరు చేరింది. ఇన్‌ఫ్లో 2500 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్‌ఫ్లోను 3,963 క్యూసెక్కులకు పెంచి నీటిని బయటకు పంపుతున్నారు.