calender_icon.png 12 January, 2026 | 7:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉచిత కంటి శస్త్ర చికిత్సలు

12-01-2026 12:00:00 AM

మంచిర్యాల , జనవరి 11 (విజయక్రాంతి) : మంచిర్యాల పట్టణంలోని పవన్ ఆప్టీకల్‌లో చెన్నూర్ రూరల్ సీఐ బన్సీలాల్, నీల్వాయి ఎస్‌ఐ జగదీశ్వర్ రెడ్డిల ఆధ్వర్యంలో ఉచితంగా నిర్వహించిన కంటి ఆపరేషన్‌ల వైద్య శిభిరాన్ని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్, జైపూర్ ఏసీపీ వెంకటేష్‌లు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ పోలీసులు కేవలం లా అండ్ ఆర్డర్ పరిరక్షణకే పరిమితం కాకుండా, సమాజ సేవలో కూడా ముందుండి ప్రజలకు అండగా నిలుస్తారని, ఇకపై కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా తమవంతు సహాయక కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, సిబ్బంది తదితరులున్నారు.