22-09-2025 12:00:00 AM
సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.
ధర్మపురి,సెప్టెంబర్21(విజయక్రాంతి): ఆర్థికభారం ఉన్నప్పటికీ గత బీఆరెస్ నీళ్లు, నిధులు, నియామకాలు పేరుతో తెలంగాణ ప్రజల్ని గత ప్రభుత్వం మోసం చేసిందనీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమా ర్ మండిపడ్డారు.2014లో 500 కోట్లు ధర్మపురి ఆలయానికి ఇస్తానని మాజీ సీఎం కేసీ ఆర్ ధర్మపురి ప్రజలను మోసం చేశారన్నా రు. దళితులకు ఇస్తానన్న మూడెకరాల భూ మి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎన్ని ఇచ్చారో మాజీమంత్రి కొప్పుల చెప్పాలన్నారు.
కొప్పుల ప్రజల్ని మోసంచేసి ధర్మపురి గోదావరి నీళ్లు ఇతర నియోజకవర్గాలకు తరలిం చారనీ మండిపడ్డారు. రెండు పంటలు పండే వ్యవసాయ భూములను నిరుపేద రైతుల నుండి లాక్కొని మేఘా కంపెనీకి కట్టబెట్టిన నీచచరిత్ర కొప్పులదే అన్నారు. 25 లక్షలకు ఎకరం వచ్చే భూమిని 9 లక్షలకు మేఘా కం పెనీకి ధారాదత్తం చేసి రైతుల నోట్లో మట్టి కొట్టారన్నారు.నిరుపేదలకు ఇందిరమ్మ ఇం డ్ల పంపణీ నిర్వీరామంగా కొనసాగుతుందన్నారు.
డిసెంబర్9వ తేదీన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశానికి కొప్పులకు కూడా ఆహ్వా నం పంపుతామన్నారు.ధరణి వల్ల సామాన్య రైతాంగాన్ని అష్టకష్టాలు పెట్టారన్నారు. యూరియా ఆలస్యంలో కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలనీ బీజేపీ పై మండిపడ్డారు.రాష్ట్ర రైతులకోసం స్వయంగా ముఖ్యమంత్రి గారే ఢిల్లీ వెళ్లి యూరియా కొరతను నివారించాలని వినతి పత్రం అందించారనీ గుర్తుచేశారు.
యూరియా అంశంలో బీజేపీ ఎంపీలు రైతుల పక్షాన నిలబడకపోవడం దురదృష్టకరమన్నారు. ధర్మపురి అభివృద్ధికి మునుపెన్నడూ లేనట్లు గా మాస్టర్ ప్లాన్లు సిద్ధం చేశామని, ధర్మపురి ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామన్నారు.ఈ కార్యక్రమంలో ధర్మపురి మండల అధ్యక్షులు సం ఘనబట్ల దినేష్, సీనియర్ నాయకులు చిలుముల లక్ష్మణ్, వేముల రాజేష్,చీపిరి శెట్టి రాజేష్ తదితరులుపాల్గొన్నారు.