25-11-2025 12:00:00 AM
హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఒడితల ప్రణవ్ బాబు
హుజురాబాద్,నవంబర్ 24:(విజయ క్రాంతి) హుజురాబాద్ నియోజకవర్గం లో విద్య, వైద్య రంగాల అభివృద్ధికి కృషి చేస్తున్నానని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ బాబు అన్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మునిసిపాలిటీ పరిధిలోని కేసి క్యాంపులో ఎంజె బిటి ప్రభుత్వ పాఠశాల అదనపు తరగతిగదుల నిర్మాణానికి 30 లక్షలతో సోమవారం భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం విద్యారంగ విషయంలో సమస్యలు తన దృష్టికి రాగానే ఎస్డిఎఫ్ నిధుల నుండి కోటి రూపాయలు విడుదల చేశామని,విద్యార్తులకు కాస్మోటిక్స్ చార్జీలు పెంచామని,ప్రజా పాలనలో ఒక్కొక్కటిగా సమస్యల పెంచామనిపరిష్కారానికి కృషి చేస్తున్నామని అన్నారు.స్కిల్ నైపుణ్యం కోసం ఐటీఐ(ఏటిసి) మంజూరు చేపించమని తెలిపారు.
కాంట్రాక్టర్లు నిర్మల పనులను తరగతిలో పూర్తి చేయాలని సూచించారు. విద్య, వైద్య పరంగా హుజురాబాద్,జమ్మికుం హాస్పిటల్స్ కు చెరో 15లక్షలు,30 లక్షల నిధులు మంజూరు చేపించామని, ఏమైనా సమస్యలు ఉంటే నా ఏమైనాదృష్టికి తీసుకు వస్తేవాటి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు తోట రాజేంద్రప్రసాద్,కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సొల్లు బాబు, సొల్లు దశరథం, బాబు, కాళీ దుస్సేన్, చందు తో పాడు తదితరులుపాల్గొన్నారు.