28-11-2025 12:00:00 AM
- సేఫ్ అండ్ క్లీన్‌కు శ్రీకారం
- శిథిల బడులు, ఇతర సమస్యల గుర్తింపు
- పాఠశాలల రూపురేఖలు మార్చడమే లక్ష్యం
- డిసెంబర్ 5 వరకు నిర్వహణ
సంగారెడ్డి, నవంబర్ 27(విజయక్రాంతి): ప్రభుత్వం సర్కారు బడుల బాగు కోసం పోకస్ పెట్టింది. పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు చర్యలు చేపట్టింది. ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ పూర్తి చేయడంతో పాటు మధ్యాహ్న భోజనం కొత్త మెనూ అ మలు చేస్తోంది. తాజాగా సేఫ్ అండ్ క్లీన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనిని గతనెల 31 నుంచి ప్రారంభించింది.
వచ్చే నెల 5 వరకు పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు, మౌలిక వసతులు, దెబ్బతిన్న ఫర్నిచర్, శిథిలావస్థకు చేరుకున్న గదులను గుర్తించను న్నారు. పనికి రాని వాటిని తొలగించి మరమ్మతుకు ఉన్నవాటిని సరిచేయనున్నారు. దీంతో విద్యార్థుల సమస్యలు కొంత దూరం కానున్నాయి. సమగ్ర శిక్షా ద్వారా పరిశుభ్రత, విద్యార్థుల రక్షణే లక్ష్యంగా ఈ కార్య క్రమం ముందుకు సాగుతుంది.
ఆహ్లాదకర వాతావరణం కోసం...
జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు వందలాదిగా ఉన్నాయి. వీటిలో వేలాది మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యార్థులకు చదువుతో పాటు ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు క్లీన్ అండ్ సేఫ్ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. పాఠశాల ఆవరణ, తరగతి, వంట గదులు, మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. అపరిశుభ్రత కారణం గా ఇటీవల విద్యార్థులు అస్వస్థ తకు గురై ఆ స్పత్రుల పాలైన విషయం తెలిసిందే. వీటికి చెక్ పెట్టేందుకు 5.0 సేఫ్ అండ్ క్లీన్ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. రోజుకో కార్యక్రమా న్ని డిసెంబర్ 5 వరకు అమలు చేయనున్నారు.
విద్యార్థుల భద్రతపై దృష్టి..
జిల్లాలోని పలు కేజీబీవీలు, పాఠశాలల్లో గతంలో ఫుట్పాయిజన్ కారణంగా విద్యార్థు లు ఆస్పత్రుల పాలైన విషయం తెలిసిందే. అలాగే కొన్ని బడుల్లో ల్యాబులు, స్టోర్ రూ మ్లు ఆధ్వానంగా మారాయి. చెత్తాచెదారంతో నిండి అపరిశుభ్రంగా దర్శనమిస్తు న్నాయి. దీంతో విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్నారు. పలు పాఠశాలలు శిథిలావస్థకు చేరాయి. ప్రమాదం జరిగితే ప్రాణనష్టం అధికంగా ఉండే అవకాశముంది.
వాటి ముప్పును తప్పించేందుకు జిల్లాలో ఎన్ని శిథిల బడులున్నాయి.. మరమ్మతులు చేపట్టాల్సినవి ఎన్ని, తొలగించా ల్సిన వాటి వివరాలను సేకరిస్తారు. అలాగే మూలనపడ్డ పాఠ్యపుస్తకాలు, చెడిపోయిన వస్తువులు, పాఠశాలకు చెందిన క్రీడా పరికరాలు పనికొస్తున్నాయా, మరమ్మతులకు నోచకున్నాయా అనే వాటిని గుర్తిస్తారు. పనికొచ్చే వాటిని, మరమ్మతులు చేసి పనికిరాని వస్తువులను స్క్రాప్ కింద విక్రయిస్తారు. దాని ద్వారా వచ్చిన డబ్బులను పాఠశాల అభివృద్ధికి వినియోగిస్తారు.
చేపట్టే పనులివే..
క్లీన్ అండ్ సేఫ్ కార్యక్రమం కోసం పాఠశాలల్లో కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ప్రధానోపాధ్యాయుడు, ఎంఈవో, అమ్మ ఆదర్శ కమిటీకి సంబంధించి అసిస్టెంట్ ఇంజినీర్, స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎం సభ్యులుగా ఉన్నారు. వీరి ఆమోదంతో స్కూల్ బిల్డింగ్లు దెబ్బతింటే మరమ్మతులు చేపట్టడం, భవనానికి సున్నం వేయించడం, వంట పాత్రలు కడిగించడం, నీటి వసతి కల్పించడం, అపరిశుభ్రంగా ఉన్న కిచెన్ షెడ్లను శుభ్రపర్చడం, తాగు నీటిపై ప్రత్యేక శ్రద్ధ వహించడం, విద్యార్థులు భోజనం చేసిన తర్వాత ట్యాబ్ల వద్ద క్లీన్ చేయిం చడం, తరగతి గదుల డోర్లకు మరమ్మతులు. చేయించడం, మురుగునీరు నిల్వ ఉండకుండా చూడటం వంటివి చేపడతారు.
అలాగే చెత్తబుట్టలు ఏర్పాటు, పాఠశాల ఆవరణలో ఉన్న చెత్తచెదారాన్ని తొలగించడం.. ఇలా అనేక కార్యక్రమాలను రోజువారీగా చేపట్టేలా ప్రణాళిక తయారు చేసి సంబంధిత ప్రధానోపాధ్యాయులకు అందజేశారు. మౌలిక వసతుల కోసం నివేదిక తయారు చేసి డీఈవోల ద్వారా రాష్ట్ర ప్రాజెక్ట్ అధికారికి పంపనున్నారు. నిధులు వచ్చిన తర్వాత మరమ్మతులు చేపట్టనున్నారు.
పకడ్బందీగా నిర్వహిస్తాం..
జిల్లాలోని అన్ని పాఠశాలల్లో క్లీన్ అండ్ సేఫ్ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపడుతున్నాం. డిసెంబర్ 5 వరకు కొనసాగుతుంది. విద్యార్థులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. అవసరమైన మౌలిక వసతులను గుర్తించి ఉన్నతాధికారులకునివేదిస్తాం.
ఎస్.వేంకటేశ్వర్లు, డీఈవో, సంగారెడ్డి