28-11-2025 12:00:00 AM
గోపాలపేట, నవంబర్27: సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలపై కఠిన పర్యవేక్షణ జిల్లావ్యాప్తంగా బందోబస్తు పటిష్ఠం సమస్యాత్మక గ్రామంపై ప్రత్యేక నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవనీ శాంతిభద్రతల విషయంలో ఎలాంటి రాజీ లేదు కఠినంగా వ్యవహారిస్తాం ఎస్పీ సునీత అన్నారు .
గురువారం రోజు గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల మొదటి విడత నామినేషన్ల దృష్ట్యా గోపాల్ పేట్, మండలంలోని గోపాల్ పేట్, తాడిపత్రి, గ్రామపంచాయతీలు మరియు ఎదుల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎదుల గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన నామినేషన్ మరియు పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ సునిత రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు.
నామినేషన్ కేంద్రాల్లో విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందితో ఎస్పీ ప్రత్యేకంగా మాట్లాడి, ఎన్నికల నియమావళి ప్రకారం నామినేషన్ ప్రక్రియ పూర్తిగా నిష్పక్షపాతంగా, శాంతియుతంగా జరుగేలా పనిచేయాలని పలు సూచనలు చేశారు. ఎలాంటి అవాంఛిత పరిస్థితులు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు పారదర్శకమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రతి సిబ్బందిపైన ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వనపర్తి డిఎస్పి, వెంకటేశ్వర్ రావు, కొనపర్తి సిఐ కృష్ణయ్య గోపాల్పేట్ ఎస్త్స్ర, నరేష్, రేవల్లి ఎస్త్స్ర, రజిత, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.