calender_icon.png 28 November, 2025 | 2:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గచ్చిబౌలిలో ఆర్‌ఎస్ బ్రదర్స్ షోరూం

28-11-2025 12:00:00 AM

16వ బ్రాంచి ప్రారంభం

హైదరాబాద్, నవంబర్ 27 (విజయక్రాంతి): హైదరాబాద్ గచ్చిబౌలిలో గురువారం తమ 16వ షోరూంను ‘ఆర్‌ఎస్ బ్రదర్స్’ వారు ప్రారంభించారు. పి. వెంకటేశ్వర్లు, ఎస్.రాజమౌళి, టి.ప్రసాద్ రావు, దివంగత పి. సత్యనారాయణ స్థాపించిన ఈ సంస్థ తన విజయవంతమైన రిటైల్ ప్రస్థానంలో ఒక విశిష్టమైన బ్రాండుగా చరిత్ర సృష్టించింది. సినీ నటి మీనాక్షి చౌదరి శుభారంభానికి ప్రత్యేక అతిథిగా వచ్చారు.

కుటుం బంలోని అన్ని తరాలవారి అవసరాలను ప్రతిబింబిస్తూ, వివాహవేడుకలకు అవసరమైన కొనుగోళ్లు గమ్యంగా, సర్వాంగసుం దరంగా ముస్తాబైన 16వ షోరూమ్ శుభారంభంలో పాలుపంచుకోవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. సంస్థ డైరెక్టర్లు, కొనుగోలుదార్ల పట్ల తమ అంకితభావం గురించి ప్రస్తావిస్తూ, వారి అవసరా లకు అనుగుణంగా గచ్చిబౌలి షోరూమును తీర్చిదిద్దడం తమ అదృష్టంగా, ఒక అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నామని అన్నారు.

సంస్థ చైర్‌పర్సన్ పొట్టి వెంకటేశ్వర్లు అతిథులకు స్వాగతం పలికారు. ఎండీ ఎస్ రాజమౌళి మాట్లాడుతూ.. భారతదేశవ్యాప్తంగా విస్తరించిన సంప్రదాయాల్ని, ఫ్యాషన్ల ను, వస్త్రాభిరుచుల్ని మేళవించి గచ్చిబౌలి షోరూములో కొలువుదీర్చాం అన్నారు. డైరెక్టర్ తిరువీధుల ప్రసాద్‌రావు తమ అభిమాన కొనుగోలుదారుల స్ఫూర్తితో తమ సంస్థ ప్రమాణాలు ముమ్మాటికీ సమున్నత స్థాయికి చేరుకుంటున్నాయన్నారు.