calender_icon.png 3 January, 2026 | 7:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయి

03-01-2026 12:00:00 AM

వనస్థలిపురం ట్రాఫిక్ సీఐ శ్రీశైలం

ఎల్బీనగర్, జనవరి 2 : రోడ్డు భద్రత నియమాలు పాటించినప్పుడే ప్రమాదాలు తగ్గుతాయి అని వనస్థలిపురం ట్రాఫిక్ సీఐ శ్రీశైలం అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు -2026 ను శుక్రవారం హయత్ నగర్ 1 డిపాలో ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.... రోడ్డు భద్రత నియమాలు పాటించడంలో ఆర్టీసీ డ్రైవర్లు జాగ్రత్తగా ఉంటున్నారని, కొన్ని సందర్భాల్లో ఎదుటి వాహనాల అజాగ్రత్తతో ఆర్టీసీ డ్రైవర్లు ప్రమాదానికి బాధ్యులు అవుతున్నారని తెలిపారు.  డ్రైవర్లు రక్షణాత్మకమైన డ్రైవింగ్ చేయాలని సూచించారు. 

అనంతరం ట్రాఫిక్ భద్రతపై డ్రైవర్లు, కండక్టర్లతో ప్రతిజ్ఞ చేయించారు.  ఉత్తమ సేవలు అందించిన డ్రైవర్లు, కండక్టర్లకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్త్స్ర బోలిశెట్టి శ్రీనివాస్, డిపో మేనేజర్ విజయ్, సహాయ మేనేజర్లు సరస్వతి, శ్రీనివాస్ పాల్గొన్నారు. అలాగే, నాగోల్ -బండ్లగూడ డిపోలో నిర్వహించిన రోడ్డు భద్రత మాసోత్సవాల్లో నామినేటెడ్ ఆర్టీవో మెంబర్, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ సురేష్ లాల్, ఎంవీఐలు శ్రీధర్, అనిత, డిపో మేనేజర్ రమేష్ బాబు, డిపో అసిస్టెంట్ మేనేజర్ రమాదేవి, డిపో సిబ్బంది పాల్గొన్నారు.