03-01-2026 12:00:00 AM
సాహెబ్‌నగర్ జడ్పీ స్కూల్‌లో ’వేస్ట్ టు వెల్త్’ ఎగ్జిబిషన్
ఎల్బీనగర్, జనవరి 2 : విద్యార్థులు పరిశోధకులుగా మారి, నూతన ఆవిష్కరణలు చేయాలని విద్యాశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని సాహెబ్ నగర్ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ప్రధాన ఉపాధ్యాయుడు ఏవీ దినేష్ ఆధ్వర్యంలో ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ నిర్వహించారు.
ఇందులో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఆధ్వర్యంలో తెలంగాణ నేషనల్ గ్రీన్ కారప్స్ హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ట మండల్ లెవెల్ ’వేస్ట్ టు వెల్త్’ ఎగ్జిబిషన్ 2026 నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ లచ్చిరెడ్డి, తెలంగాణ ఎన్జీసీ కోఆర్డినేటర్ రాధిక గారు, హయత్ నగర్ ఎంఈవో శ్రీనివాస్, అబ్దుల్లాపూర్ మెట్టు ఎంఈవో జగదీష్, డీఎస్వో శ్రీనివాస్ రావు, హయత్ నగర్ జడ్పీ స్కూల్ హెచ్‌ఎం ఇందిరా తదితరులు హాజరై మాట్లాడారు.
తెలంగాణ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం (EEP) అనేది పర్యావరణ, అటవీ శాఖ చేపట్టిన కార్యక్రమని, దీని ప్రధాన లక్ష్యం విద్యార్థుల్లో పర్యావరణ అవగాహన కల్పించడం, సుస్థిర పద్ధతులను ప్రోత్సహించడం అన్నారు. పర్యావరణ విద్యకు నమూనాగా పాఠశాలల్లో ఎకో-క్లబ్, నేషనల్ గ్రీన్ కారప్స్ (NGC) కార్యక్రమాలతో, ’మిషన్ లైఫ్’ (Lifestyle for Environment) చేపట్టినట్లు తెలిపారు. అనంతరం వివిధ పాఠశాలల విద్యార్థులు తయారుచేసిన పరికరాలను ప్రదర్శించారు.