calender_icon.png 1 August, 2025 | 10:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నర్సులే మార్గదర్శకులు

01-08-2025 01:23:36 AM

  1. ప్రజల బాగోగుల కోసమే ప్రజా ప్రభుత్వం 
  2. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 

నల్లగొండ టౌన్, జూలై 31: డాక్టర్లు చికిత్స చేస్తారు.. రోగులకు భరోసా,సేవా దృక్పథం అంతా నర్సులదే  వాళ్లే నిజమైన మార్గదర్శకులు అని రోడ్లు,భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి  కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని   ప్రభు త్వ వైద్య కళాశాల సమీపంలో  40 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ప్రభుత్వ నర్సింగ్ కళాశాల భవనానికి భూమి పూజ చేసి మాట్లాడారు.

చదువుతోనే అభివృద్ధి సాధ్యమని, అందువల్ల విద్యార్థులు బాగా చదువుకోవాలన్నారు. ప్రస్తుతం మహిళా ప్రాంగణంలో నిర్వహిస్తున్న నర్సింగ్ కళాశాలలో రెండు రోజుల్లో తాగునీటి ఆర్ ఓ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ,నెల రోజుల్లో ప్రతీక్ ఫౌండేషన్ సహకారంతో బాత్రూంలు, ఇతర సౌకర్యాలన్నీ కల్పిస్తామని తెలిపారు. కేరళలో 99.9% అక్షరాస్యత ఉండగా, మన రాష్ట్రంలో 60 శాతం ఉందని, విద్య, నైపుణ్యాలు పెంపొందింపజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ యూనివర్సి టీతో పాటు, అన్ని రకాల విద్యా సదుపాయాలు కల్పిస్తున్నదని అన్నారు.

నర్సింగ్ విద్యార్థులు చదువు పైన దృష్టి సారించాలని, సెల్ ఫోన్ జోలికి వెళ్ళవద్దని, ప్రజలకు మంచి సేవలు అందించాలని, సమయాన్ని వృధా చేసుకోవద్దని అన్నారు. ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థు లకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఈ నెల 4 న ప్రభుత్వ వైద్య కళాశాల పక్కనే 150 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్  రెసిడెన్షియల్  పాటశాల పనులకు భూమి పూజ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందని, ముఖ్యంగా 20 వేల కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మించనున్నదని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో 100 కోట్ల రూపాయలతో భవనాలు నిర్మించామని, ఫ్యాకల్టీ, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని, ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి ఎల్‌ఎల్‌ఎం, ఎం ఫార్మసీ, కోర్సులు,భవనాలు మంజూరు చేశారని ,2026-27 సంవత్సరంలో అడ్మిషన్లు సైతం ప్రారంభం కానున్నాయని,

లా, ఫార్మసీకి మంచి డిమాండ్ ఉందన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో విద్యాభివృద్ధికి ఎలాంటి  కృషి చేయలేదని అంతేకాక గత ప్రభుత్వం తొమ్మిది వేల కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు పెట్టినప్పటికీ గత  ప్రభుత్వం చేసిన అప్పులకు ప్రతినెల 6000 కోట్ల వడ్డీ చెల్లిస్తు న్నప్పటికీ మంచి విద్యను అందించాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టికి కేంద్రీకరించినట్లు తెలిపారు.

జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ నర్సింగ్ కోర్స్ చాలా ఉత్తమమైనదని, వైద్యరంగంలో నర్సింగ్ అనేది మొదటి అదుగు అని అన్నారు.  మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, ఆర్ డి ఓ  వై.అశోక్ రెడ్డి, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ ప్రశాంతి తదితరులు ఉన్నారు.

ప్రధాన ఆస్పత్రిలో అవసరమైన సౌకర్యాలు కల్పిస్తాం 

నల్లగొండ టౌన్, జులై 31: నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలోని అన్ని విభాగాలలో అవసరమైన వైద్య పరికరాలు, సౌకర్యాలను కల్పిస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమ టిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఇందుకుగాను అవసరమైన ప్రతిపాదనలను తక్షణమే రూపొందించి సమర్పించాల్సిందిగా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్, ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

గురువారం ఆయన నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో అభివృద్ధి పరిచిన డయాలసిస్ కేంద్రా న్ని ప్రారంభించారు. అంతేకాక డయాలసిస్ కేంద్రానికి వచ్చిన నూతన వైద్య పరికరాలను పరిశీలించారు. అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్ ఛాంబర్ లో ఆసుపత్రి వైద్యులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో  మంత్రి మాట్లాడుతూ.. నల్గొండ జిల్లాలో వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 

బ్లడ్ బ్యాంక్ కు అవసరమైన రిఫ్రిజిరేటర్ ఇతర సౌకర్యాలను కల్పిస్తామని తెలిపారు.  త్వరలోనే బ్లడ్ బ్యాంక్ ద్వారా ఉచిత రక్తదాన శిబిరాన్ని నిర్వహించేందుకు ఏర్పాటు చేయాలని ఆదేశిం చారు.  జిల్లా కలెక్టర్  ఇలా త్రిపాఠి, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటిండెంట్ డాక్టర్ అరుణ కుమారి, డి ఎం హెచ్ ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ డిఎం హెచ్ ఓ వేణుగోపాల్ రెడ్డి ,ఆసుపత్రి వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.

ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల రాష్ట్రానికే ఆదర్శం కావాలి

నల్లగొండ టౌన్, జులై 31 : నల్లగొండ జిల్లా కేంద్రంలోని జివి గూడెం వద్ద 200 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షి యల్ పాఠశాల నిర్మాణానికి ఈ నెల 4 న భూమి పూజ నిర్వహించనున్నట్లు రాష్ట్ర రో డ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి  తెలిపారు. నల్గొండ రెసిడెన్షియల్ పాఠశాలను రాష్ట్రానికే ఆదర్శంగా ఉండేలా  నిర్మించాలని ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్ ను ఆయన ఆదేశించారు.

గురువారం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల  నమూనా,నిర్మాణ పనుల పై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో కలిసి  సమీక్షించారు. 5 లక్షల 58 వేల అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ పాఠశాలలో 9 వసతి గృహాలు, సిబ్బంది క్వార్టర్స్, 3000 మందికి ఒకేసారి భోజనాన్ని వండేలా వంటగది, 1280 మంది ఒకేసారి భోజనం చేసే విధంగా డైనింగ్ హాల్ వంటి వాటితో నిర్మాణాన్ని చేపట్టనున్నారు. 

ఈ విషయాల న్నిం టినీ టి జి ఈ డబ్ల్యు ఎం ఐ డి సి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బాల ప్రసాద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర మంత్రికి, జిల్లా కలెక్టర్ కు వివరించారు.   4న నిర్వహించనున్న భూమిపూజకి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల  ఇంచార్జ్ అదనపు కలెక్టర్ ,మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, నల్గొండ ఆర్ డి ఓ వై. అశోక్ రెడ్డి, టీజీ ఈ డబ్ల్యు ఐడిసి డిప్యూటీ ఇంజనీర్ శైలజ, తదితరులు హాజరయ్యారు.