14-07-2025 06:45:18 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): బొమ్మకల్ లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కోల అన్నా రెడ్డి-లావణ్య కుమారుడు కోల ఆదిత్య సివిల్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించగా 3వ వర్ధంతి సందర్భంగా సోమవారం బొమ్మకల్ సెంటర్ లైటింగ్ ఇటుక బట్టీల వద్ద వలస కూలీలకు అన్నదానం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఇంజనీర్ కొల అన్నారెడ్డి, చింతల కిషన్ పటేల్, బట్టు రాజేందర్, క్లబ్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే మాతశిశు ప్రభుత్వ ఆసుపత్రి నందు అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రవి కంటి భాగ్యలక్ష్మి, బద్దం మల్లారెడ్డి, లంబు రాజిరెడ్డి, నరహరి లక్ష్మారెడ్డి, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వెంకటేశ్వర టెంపుల్ నందు కరీంనగర్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముక్క శరత్ కృష్ణ, మ్యాడం శివకాంత్, బట్టు వినోద్, పెద్ది విద్యాసాగర్, కొండ రాంబాబు, ఎలగందుల మునీందర్, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.