calender_icon.png 15 July, 2025 | 6:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ పురస్కారం అందుకున్న జర్నలిస్ట్ క్రాంతి కుమార్

14-07-2025 11:58:25 PM

మందమర్రి (విజయక్రాంతి): అంతర్జాతీయ సేవా సంస్థ తెలుగు సంస్కృతి సాహితి సేవా ట్రస్ట్, తెలంగాణ సంస్కృతి సాహితీ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం వరంగల్ లోని రామయ్య ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం(Awards Ceremony Program) ఆద్యంతం వీక్షకులను విశేషంగా అలరించాయి. ఈ వేడుకల్లో మంచిర్యాల జిల్లాకు చెందిన జర్నలిస్ట్ జాడ క్రాంతి కుమార్ దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరై, వివిధ రంగాలకు చెందిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వివిధ రాష్ట్రాలకు చెందిన వారిని వివిధ పురస్కారాలతో ఘనంగా సత్కరించి, ఘనంగా సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు.

ఈ వేడుకల్లో ఉత్తమ జర్నలిస్టుల విభాగంలో జిల్లాలోని మందమర్రి పట్టణానికి చెందిన జాడ క్రాంతి కుమార్ కు జాతీయ మహానంది అవార్డు-2025ను అందజేసి, ఘనంగా సన్మానించారు. అవార్డు అందుకున్న ఆయనను  పలువురు జర్నలిస్టులు, స్నేహితులు, స్థానిక ప్రజలు ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత మాట్లాడుతూ, ఈ గౌరవం తనకు మరింత బాధ్యతను పెంచిందని తెలిపారు. ప్రజలకు వాస్తవ పరిస్థితులు అవగతం అయ్యేలా, నిజాలను వెలికి తీసేందుకు, న్యాయంగా సమాచారం ప్రజలకు, అదేవిధంగా ప్రభుత్వానికి అందించేందుకు కృషి చేస్తానన్నారు.ఈ అవార్డుతో జిల్లా జర్నలిస్టులకు దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు లభించినట్లు పలువురు వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ మాచవరం గౌరీశంకర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి బట్టు శ్రీనివాస్ రావు లు పాల్గొన్నారు.