calender_icon.png 15 July, 2025 | 12:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి నియోజకవర్గ కేంద్రంలో హోల్ సేల్ చేపల మార్కెట్ ఏర్పాటు చేయాలి

14-07-2025 06:48:46 PM

ప్రతి మత్స్య సొసైటీ జల వనరులకు సరిపడేంత చేప/రొయ్య పిల్లల కొనుగోలు కోసం సొసైటీ ఖాతాలో నగదు జమ చేయాలి

కామారెడ్డి జిల్లా మత్స్యకారుల సదస్సులో తీర్మానం..

కామారెడ్డి (విజయక్రాంతి): ప్రతి నియోజకవర్గ కేంద్రంలో హోల్సేల్ చేపల మార్కెట్ ఏర్పాటు చేయాలని తెలంగాణ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం జిల్లా సదస్సులో తీర్మానం చేశారు. కామారెడ్డి జిల్లా(Kamareddy District) కేంద్రంలోని విజ్ఞాన భారతి డిగ్రీ కళాశాల(Vignana Bharathi Degree College)లో నిర్వహించిన సదస్సుకు ముఖ్య అతిథిగా తెలంగాణ మత్స్యకారుల మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేలేల బాలకృష్ణ హాజరై మాట్లాడారు. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు కావస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నేటికీ ఉచిత చేపల విషయంలో నిర్దిష్టమైన ప్రకటన చేయకపోవడం మత్స్యకారులను ఆందోళనకు గురి చేస్తుందన్నారు. వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారని తక్షణమే ప్రభుత్వం స్పందించి ఎలాంటి టెండర్లు లేకుండా మత్సర్సైకి ఖాతాలో నగదు జమ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

జిల్లాలో అర్హులైన అనేక మంది మత్స్యకారులకు సొసైటీలో కొత్త సభ్యత్వం తీసుకొని ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందే విధంగా మత్స్యశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో భూముల రేట్లు విపరీతంగా పెరగడంతో భూస్వాములు దళారీలు పెద్ద ఎత్తున చెరువులు కుంటలు కబ్జాలు చేస్తున్నారని దీనితో మత్స్యకారులుకు  ఇబ్బందు లో ఎదురవుతున్నాయ ని తెలిపారు. ద్వారా సర్వే చేయించి ఫెన్సింగ్ వేయించాలని కోరారు. దేశంలో కేంద్ర ప్రభుత్వం ఎన్సిడిసి, ఎన్ ఎఫ్ డి బి నిధులను ఎత్తివేయడానికి ప్రతి ఒక్క మత్స్య కార్మికులు ప్రశ్నించా లని అన్నారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో అధునాతనమైన సౌకర్యాలతో చేపల మార్కెట్ నిర్మించి వేలాది మంది మత్స్యకారులకు ఉపాధి కల్పించాలన్నారు.

ఈ సమావేశంలో కులవృత్తి సంఘాల జిల్లా కన్వీనర్ వెంకట్ గౌడ్, పచ్చ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు మామిళ్ల జగదీష్, మచ్చ కార్మికుల మహిళా విభాగం రాష్ట్ర కోకన్వీనర్ బక్కి బాలమని, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మోతి రామ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ప్రతి మత్స్య సొసైటీ జల వనరులకు సరిపడెంతా ఉచిత  చేప/రొయ్య పిల్లలను మత్స్య సొసైటీ ఖాతాలో నగదు జమ చేయాలని TMKMKS మత్స్యకారుల కామారెడ్డి జిల్లా సదస్సు తీర్మానం చేసింది. ఈరోజు తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం కామారెడ్డి జిల్లా సదస్సు జిల్లా కేంద్రంలోని విజ్ఞాన భారతి డిగ్రీ కాలేజీలో జరిగింది.

ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన లెల్లెల బాలకృష్ణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం మాట్లాడుతూ వర్షాకాలం సీజన్ ప్రారంభమై రెండు నెలలు కావస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నేటికీ ఉచిత చేప రొయ్య పిల్లల విషయంలో నిర్దిష్టమైన ప్రకటన చేయకపోవడం రాష్ట్రవ్యాప్తంగా మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారని  తక్షణమే ప్రభుత్వం స్పందించి ఎలాంటి  టెండర్లు లేకుండా మత్స్య సొసైటీ ఖాతాలో నగదు జమ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలో అర్హులైన అనేకమంది మత్స్యకారులకు సొసైటీలో కొత్తగా సభ్యత్వం తీసుకొని ప్రభుత్వ సంక్షేమలు పొందే విధంగా ముఖ్యశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తెలంగాణలో భూముల రేట్లు విపరీతంగా పెరగడంతో భూస్వాములు దళారీలో పెద్ద ఎత్తున చెరువులు కుంటలు కబ్జాలు చేస్తున్నారని దీంతో మత్స్యకాలకని ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రభుత్వం చెరువులు కుంటలు సాటిలైట్ ద్వారా సర్వే చేయించి ఫెన్సింగ్ వేయించాలని డిమాండ్ చేశారు, దేశంలో కేంద్ర ప్రభుత్వం NCDC NFDB నిధులను ఎత్తివేయడాన్ని ప్రతి ఒక్కరు ప్రశ్నించారని మాట్లాడారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఆధునాతన మైన సౌకర్యాలతో హోల్ సేల్ చేపల మార్కెట్ నిర్మించి వేలాది మంది మత్స్యకారులకు ఉపాధి కల్పించాలని సమావేశంలో తీర్మానించారు, ఈ కార్యక్రమంలో వృత్తి సంఘాల జిల్లా కన్వీనర్ వెంకట్ గౌడ్, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు మామిండ్ల జగదీష్, మత్స్య మహిళా విభాగం రాష్ట్ర కోకన్వీనర్ బక్కీ బాలమణి, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మోతీ రామ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.