calender_icon.png 27 January, 2026 | 5:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కురుల అందానికి..

07-01-2025 12:00:00 AM

కురులు అందంగా.. పొడవుగా.. ఒత్తుగా ఉండాలని కోరుకుంటారు చాలామంది అమ్మాయి.. దీనికోసం మార్కెట్‌లో లభించే ఎన్నో ప్యాక్‌లాను ఉపయోగిస్తుంటారు. అలా కాకుండా జుట్టును దృఢంగా.. సిల్కీగా చేయడంలో కలబంద జెల్ ప్రముఖ పాత్ర పోసిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కలబంద జెల్‌ను హెయిర్ ప్యాక్‌లా వాడితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అవేంటో చూద్దాం.. 

అరటి పండు, కలబందను ఉపయోగించి కూడా హెయిర్ ప్యాక్‌ను తయారు చేసుకోవచ్చు. ఈ ప్యాక్ జుట్టును సిల్కీగా చేస్తుంది. ఇందుకోసం ఒక అరటిపండును మెత్తగా గుజ్జులా చేసుకోవాలి. అందులో ఒక చెంచా తేనె కలపాలి. తర్వాత కలబంద జెల్‌ను మిక్స్ చేసి.. జుట్టుకు ఒక 30 నిమిషాల పాటు పట్టించాలి. ఈ ప్యాక్ పూర్తిగా ఆరిన తర్వాత గోరు వెచ్చటి నీటితో శుభ్రంగా కడుక్కుంటే సరిపోతుంది. 

కలబందలో జుట్టుకు అవసరమైన పోషకాలు ఉంటాయి. ఇవి జుట్టును స్మూత్‌గా, సిల్కీగా చేస్తాయి. గుడ్డులోని ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టును దృఢంగా చేస్తుంది. ఒక గుడ్డులో, కలబంద జెల్‌ను బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు మూలాల నుంచి చివర్ల వరకు పూర్తిగా పట్టించాలి.  ఈ ప్యాక్ పూర్తిగా ఆరిన తర్వాత వాష్ చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే జుట్టు మెరిసిపోతుంది. 

పెరుగు, కలబందతో హెయిర్ ప్యాక్ తయారీ చేసుకుని వాడితే జుట్టు పట్టులా మారుతుంది. ఎందుకంటే పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది జుట్టును మృదువుగా చేసి, పట్టులా మెరిసేలా చేస్తుంది. ఈ ప్యాక్‌తో తలలోని మృతకణాలు కూడా తొలగిపోతాయి. ఇందుకోసం పెరుగు, కలబంద జెల్‌తో పాటుగా కొన్ని చుక్కల నిమ్మరసం కూడా వేసి జుట్టుకు పట్టించాలి. 30 నిమిషాలు అలాగే ఉంచి చల్లటి నీటితో వాష్ చేయాలి. ఇలా తరచుగా చేయడం వల్ల అనేక లాభాలు ఉంటాయి. ఇందులోని పోషకాలు జుట్టు పెరిగేలా చేస్తాయి. 

మందార, కలబంద హెయిర్ ప్యాక్ కూడా జుట్టుకు ఉపయోగపడుతుంది. ఒక కప్పు కలబంద జెల్‌లో మందార పువ్వు పేస్ట్ రెండు చెంచాలు కలిపి.. జుట్టుకు ఒక 15 నిమిషాలు పట్టించాలి. తర్వాత చల్లటి నీటితో జుట్టును శుభ్రం చేసుకోవాలి.