22-07-2025 12:17:48 AM
ఈడీకి సుప్రీంకోర్టు మొట్టికాయలు
న్యూఢిల్లీ, జూలై 21: కర్ణాటకలోని రూ.వందల కోట్ల విలువైన మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ కుంభకోణానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ)కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సతీమణి పార్వతికి సమన్లు జారీ చేయ డాన్ని క్వాస్ చేస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని ఈడీ సుప్రీంలో సవాలు చేసింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవా య్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ యుద్ధాలు కోర్టు బయట చేసుకోవాలని పేర్కొంది. అలాంటి పోరా టాలకు ఈడీని ఎందుకు వాడుతున్నారని ప్రశ్నించింది.
ఆయన హైకోర్టు జస్టిస్.. మర్యాద ఇవ్వండి
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై ఎఫ్ ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషనర్ తరఫు న్యా యవాదిని సుప్రీంకోర్టు మందలించింది. ఒక హైకోర్టు న్యాయమూర్తిని వర్మ అని ఏకవచనంతో న్యాయవాది సంబోధించడాన్ని సీరియస్‌గా తీసుకుంది. ‘ఆయన మీకు స్నేహితు డా? ఆయనే ఇప్పటికీ జస్టిస్ వర్మే. మీరు ఆయనను మర్యాద లేకుండా సంభోదిస్తారా? ’ అని బీఆర్ గవా య్ ప్రశ్నించారు. కాగా జస్టిస్ వర్మ పై నమోదైన పిటిషన్‌పై అత్యవసర విచారణకు సుప్రీం నిరాకరించింది.