calender_icon.png 21 September, 2025 | 2:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోడు సాగుదారులపై ఫారెస్ట్ దౌర్జన్యాన్ని ఆపాలి

20-09-2025 11:59:50 PM

మణుగూరు,(విజయక్రాంతి): పోడు సాగుదారుల  పై దౌర్జన్యాన్ని, పంటల విధ్వంసాన్ని వెంటనే ఆపాలని, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజాపందా) మణుగూరు డివిజన్ కార్యదర్శి ఆర్. మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఆయన మండలంలోని పోడు భూములను సందర్శించి, మాట్లాడారు. ఇటీవల కాలంలో ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది డివిజన్ లో పోడు సాగుదారులపై దౌర్జన్యం చేస్తూ, పంటలు విధ్వంసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుడుగుల, ఇప్పల గుంపు తదితర చోట్ల పంట చేతికి వచ్చే టైంలో పత్తి చేను పీకటం,  ట్రెంచులు కొట్టడం దుర్మార్గంమని, ఇలాంటి చర్యలు మానుకోవాలన్నారు. పాత పోడుభూముల జోలికి ఫారెస్ట్ వెళ్లడం సరికాదన్నారు. వలస ఆదివాసుల పట్ల వివక్షత విడనాడి వారి పోడు భూములకు పట్టాలు  ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.