21-09-2025 12:01:24 AM
హైకోర్టు న్యాయమూర్తి శరత్
యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 20 (విజయకాంతి): హైకోర్టు న్యాయమూర్తి, యాదాద్రి భువనగిరి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ న్యాయమూర్తి జస్టిస్ కె శరత్ శనివారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని న్యాయమూర్తులతో సమావేశాన్ని నిర్వహించి పెండింగు కేసుల పరిష్కారం తదితర విషయాలపై తగు సూచనలు చేశారు. నూతన జిల్లా కోర్టుల నిర్మాణానికై కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. కలెక్టర్ ఎం హనుమంతరావు, డిసిపి అక్షాంశ్ యాదవ్ హైకోర్టు న్యాయమూర్తిని కలిసి పుష్పగుచ్ఛం అందించారు.
హైకోర్టు న్యాయమూర్తితో పాటు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ జయరాజు, మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ముక్తిదా, న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి వి. మాధవిలత, రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి సబిత, భువనగిరి అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఎన్ శ్యాంసుందర్ , ఆలేరు జూనియర్ సివిల్ జడ్జి ఆర్ . అజయ్ కుమార్ , చౌటుప్పల్ జూనియర్ సివిల్ జడ్జి మహతి వైష్ణవి, భువనగిరి ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి జి. స్వాతి, రామన్నపేట ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి ఎస్. శిరీష, యాదాద్రి జూనియర్ సివిల్ జడ్జి చండీశ్వరి దేవి పాల్గొన్నారు.