14-10-2025 08:33:29 PM
కొండపాక: కుకునూర్ పల్లి మండల పరిధిలోని లకడారం గ్రామ శివారులో ఉన్న మల్లన్న వనంను సిరిసిల్ల జిల్లా సి.సి.ఎఫ్, ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ ప్రియాంక నర్గీస్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా వనంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, మొక్కల పెంపకం, సంరక్షణ చర్యలును పరిశీలించారు. తదుపరి ఆమె సిబ్బందికి పలు సూచనలు చేస్తూ వనం అభివృద్ధిపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా ఫారెస్ట్ అధికారి శ్రీనివాసులు, జిల్లా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఇక్రముద్దీన్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ చందు, ఇతర అటవీ సిబ్బంది పాల్గొన్నారు.