14-10-2025 08:32:01 PM
గద్వాల (విజయక్రాంతి): జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం ధరూరు మండలం పరిధిలో పొలాలలో పనిచేస్తున్న ముగ్గురు బాల కార్మికులను గుర్తించారు. అనంతరం వారిని సంబంధిత జడ్.పి.హెచ్.ఎస్ ఉన్నత పాఠశాలలో చేర్పించారు. అలాగే గట్టు మండలం నల్లగట్టు తాండ గ్రామ పరిధిలో పొలంలో పనిచేస్తున్న ముగ్గురు బాల కార్మికులను డ్రాపౌట్ గుర్తించిన అధికారులు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను జిల్లా లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులకు బాలల హక్కుల గురించి మరియు బాల కార్మికుల చట్టాల గురించి అవగాహన కల్పించారు.
బాలలతో పని చేయించడం నేరమని, వారి భవిష్యత్తు నాశనం అవుతుందని అన్నారు. బాలల విషయంలో వారిని చదువు వైపు ప్రోత్సహించేందుకు అందరి సహకారం అవసరమన్నారు. పాఠశాల యొక్క సదుపాయాలను మధ్యాహ్నం భోజనంలో నాణ్యతను పరిశీలించి, మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని తెలిపారు. అనంతరం లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు విద్యార్థుల డ్రాపౌట్ గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ రాజేందర్, శ్రీనివాసులు చైల్డ్ వెల్ఫేర్ అధికారులు లక్ష్మీదేవి, దస్తగిరి పాల్గొన్నారు.