17-09-2025 03:29:06 PM
చివ్వెంల (విజయక్రాంతి): మండలంలో రేపటి నుండి యూరియా పంపిణీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నందు రెవెన్యూ గ్రామాల వారిగా ఇవ్వడం జరుగుతుంది. కావున రైతులు రెవెన్యూ గ్రామాల వారీగా సంబంధిత సొసైటీ దగ్గరకు వచ్చి యూరియా తీసుకెళ్లాలని ఎంఏఓ డి.వెంకటేశ్వర్లు, తహశీల్దార్ ఎన్.టి. ప్రకాష్ రావు కోరారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చివ్వెంల నందు రెవెన్యూ గ్రామాలు చివ్వెంల, బిబి గూడెం, దురాజ్ పల్లి, పిఎసిఎస్ చందుపట్ల నందు రెవెన్యూ గ్రామాలు చందుపట్ల, తిమ్మాపురం పిఎసిఎస్ వట్టి ఖమ్మం పహాడ్ నందు రెవెన్యూ గ్రామాలు వట్టి ఖమ్మం పహాడ్, గాయం వారి గూడెం, ఐలాపురం పిఎసిఎస్ తిరుమలగిరి నందు రెవెన్యూ గ్రామాలు తిరుమలగిరి, గుంపుల, గుంజలూరు, వల్లభాపురం, తుల్జారావుపేట, ఉండ్రుగొండ పైన తెలిపిన రెవెన్యూ గ్రామాల రైతులు సంబంధిత సొసైటీ బ్రాంచ్ నందు మాత్రమే యూరియా తీసుకోగలరు. రైతులు తప్పనిసరిగా పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు తీసుకుని స్వయంగా రావాలని తెలియజేయడం జరుగుతుంది. సంబంధిత సొసైటీ బ్రాంచ్ నందు యూరియా వచ్చే సమాచారం వ్యవసాయ విస్తరణ అధికారులు తెలియజేస్తారు. కావున రైతులు సహకరించాలని కోరారు.