24-09-2025 05:28:30 PM
తాండూరు,(విజయక్రాంతి): ప్రతి ఒక్కరూ శుభ్రత పాటిస్తే పట్టణాన్ని పరిశుభ్రమైన పట్టణంగా మార్చవచ్చని వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ కమిషనర్ యాదగిరి అన్నారు. బుధవారం ఆయన స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో భాగంగా పలు వార్డుల్లో పర్యటించి ప్రజల మాట్లాడుతూ... సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తడి, పొడి చెత్త వేరువేరుగా అందించాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం అవుతుందని, ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మేనేజర్ నరేందర్ రెడ్డి శానిటరీ ఇన్స్పెక్టర్ ఉమేష్ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.