20-05-2025 01:03:11 AM
మేడ్చల్, మే 19 (విజయ క్రాంతి): మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి సోమవారం సరస్వతీ నది పుష్కరాల సందర్భంగా త్రివేణి సంగమం కాలేశ్వరం వద్ద పుణ్యస్నానం చేశారు. అనంతరం కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
ఆలయ పురోహితులు మల్లారెడ్డికి ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం వరంగల్లోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. మల్లారెడ్డి వెంట మేడ్చల్ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, గుండ్ల పోచంపల్లి మాజీ సర్పం మద్దుల శ్రీనివాస్ రెడ్డి తదితరులున్నారు.