calender_icon.png 7 November, 2025 | 1:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కంచిలో బంగారు, వెండి బల్లుల తాపడాలు తారుమారు!

07-11-2025 12:01:08 AM

-ఆలయ ఈఓ రాజ్యలక్ష్మిని 8 గంటలు విచారించిన పోలీసులు

కాంచీపురం, నవంబర్ 6: తమిళనాడులో ని కంచి ఆలయంలో బల్లుల విగ్రహాలకు ఉన్న తాపడాలు తారుమారు అయ్యాయనే ఆరోపణలు కలకలం రేపాయి. ఈ మేరకు ఫిర్యాదు రావడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ ఆలయంలో ప్రస్తుతం పునరుద్ధరణ పనులు చేస్తున్నారు. ఈ సమయంలో కంచి ఆలయంలోని బంగారు, వెండి బల్లుల తాపడాలను మార్చేసి, వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేశారని శ్రీరంగానికి చెందిన రంగరాజ నరసింహ ఫిర్యాదు చేశారు.

దీంతో విగ్రహాల అక్రమ తరలింపు నిషేధ విభాగం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ఆలయ ఈఓ రాజ్యలక్ష్మిని పోలీసులు బుధవారం 8 గంటల పాటు విచారించినట్లు తెలిసింది. ఆలయంలోని ఇతర సిబ్బందిని కూడా ప్రశ్నించారు. అవసరమైనప్పుడు విచారణకు రావాలని ఆలయ ఈఓ, సిబ్బందిని ఆదేశించినట్లు సమాచారం. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. 108 దివ్య క్షేత్రాల్లో కాంచీపురంలోని వరదరాజస్వామి ఆలయం ఒకటి. ఈ ఆలయంలో బంగారు, వెండి బల్లులు ఎంతో విశిష్టమైనవి. ఈ ఆలయాన్ని రోజూ దేశ నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు వచ్చి దర్శించుకుంటారు.