calender_icon.png 29 June, 2025 | 4:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

28-06-2025 11:36:41 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల మైనార్టీ విభాగం మాజీ అధ్యక్షులు జహంగీర్ నాలుగు రోజుల క్రితం గుండెపోటుతో మరణించిన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ వారి కుటుంబాన్ని శనివారం గజ్యానాయక్ తాండలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చి 25000/- ఆర్థిక సహాయం చేశారు. కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని వారికి భరోసనిచ్చారు. ఆయన వెంట మాజీ జడ్పిటిసి మినికురి రాంరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు పగడల బాలచంద్రం,జనరల్ సెక్రటరీ రాజా గౌడ్, గోవింద్ రెడ్డి ,శ్రీకాంత్ రెడ్డి, గజ్యానాయక్ తండా మాజీ సర్పంచ్ హాంజినాయక్, మాజీ ఉప సర్పంచ్ తోకల కిషన్, మాజీ మండల కోప్షన్ అబ్దుల్ ఖాన్, గ్రామ జనరల్ సెక్రటరీ భూక్యా భాస్కర్, మాచారెడ్డి యూత్ అధ్యక్షుడు చల్ల కృష్ణ, కకుల గుట్ట మాజీ సర్పంచ్ హెంలా నాయక్, లచ్చ పేట మాజీ ఎంపీటీసీ బుస శ్రీనివాస్, ఘన్పూర్ మాజీ ఉప సర్పంచ్ మల్లేశ్ యాదవ్, నాయకులు అక్కపూర్ రమేష్,దేవరాజు, నాగరాజు, అజీజ్, తుమ్మ శ్రీనివాస్, అగుళ్ల లీల తదితరులున్నారు.