calender_icon.png 29 June, 2025 | 4:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడా పాఠశాలలో ప్రవేశం కొరకు రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక

28-06-2025 11:39:58 PM

జిల్లా యువజన క్రీడాధికారి హనుమంతరెడ్డి

మంచిర్యాల,(విజయక్రాంతి): ప్రభుత్వ క్రీడా పాఠశాలలో 4వ తరగతిలో ప్రవేశం కొరకు రాష్ట్రస్థాయిలో హకీంపేట ప్రభుత్వ క్రీడా పాఠశాలలో నిర్వహించే పోటీలకు జిల్లా విద్యార్థులను ఎంపిక చేయడం జరిగిందని జిల్లా యువజన క్రీడా అధికారి హనుమంత రెడ్డి శనివారం తెలిపారు. జిల్లా నుంచి ఎంపికైన విద్యార్థుల తల్లిదండ్రులు, వారి పిల్లలతో ఈ నెల 30న మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల లోపు హకీంపేట క్రీడా పాఠశాలలో హాజరుకావాలని కోరారు. జిల్లాలోని జన్నారం మండలానికి చెందిన బోర్లకుంట విష్ణు తేజ, దవుల తన్విత్, వి. అభ్యాస్, జె. రిషి వర్ధన్, అట్టెం శాన్విత శ్రీ, బోర్లకుంట మహిత, బండారి శృతిక, మందమర్రి మండలానికి చెందిన మాయ శ్రీయాన్, మిట్టకొల హన్షిత్, చిత్తారి అక్షయ, వేమనపల్లి మండలానికి చెందిన జి. అంజన్న, జి. నిహారిక, కె. శ్రీజ, ఎం. వర్షిని, బెల్లంపల్లి మండలానికి చెందిన కౌట్ల హర్షిత్ సాయి, అర్సం చిన్మయి చిత్రిక, మంచిర్యాల మండలానికి చెందిన షేక్ నయీమ్, దండే శ్రీయాన్సీ, కాసిపేట మండలానికి చెందిన మేడ సహర్షవర్ధన్, కన్నెపల్లి మండలానికి చెందిన జాడీ అక్షర లు ఎంపికయ్యారని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు సకాలంలో హాజరు కావాలని, మరిన్ని వివరాలకు 99635 39234లో సంప్రదించవచ్చని తెలిపారు.