20-05-2025 12:21:18 AM
పాపన్నపేట, మే 19: పాపన్నపేట మండల పరిధిలోని బాచారం గ్రామంలో నూతనంగా నిర్మించిన దేవాయలంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెదక్ జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, మండల నాయకులతో కలసి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, సకల శుభాలు కలగాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాపన్నపేట మండలం మాజీ ఎంపీపీ సొంగ పవిత్ర దుర్గయ్య, మెదక్ జిల్లా రైతుబంధు మాజీ అధ్యక్షులు సోములు, పాపన్నపేట మండల రైతు బంధు మాజీ అధ్యక్షులు గడిల శ్రీనివాస్ రెడ్డి, ఏడుపాయల దేవస్థానం మాజీ చైర్మన్లు బాలాగౌడ్,
విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ సర్పంచ్ లు వెంకట్ రాములు, గురుమూర్తి గౌడ్, లింగ రెడ్డి, ఆశయ్య, నాయకులు సాయిరెడ్డి, బాబా గౌడ్, దుర్గయ్య, వెంకటేశం, రాము గుప్తా, కృష్ణ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.