calender_icon.png 28 October, 2025 | 3:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయం

22-09-2024 07:20:02 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): జిల్లాలోని మద్నూర్ మండల కేంద్రంలో ఉచిత వైద్య శిబిరాన్ని మాజీ ఎంపీ బీబీ పాటిల్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ... ప్రధాని మోది జన్మదినం సందర్భంగా సేవాపక్షోత్సవాల్లో భాగంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. మద్నూర్ మండల కేంద్రంలో బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఆరోగ్య శిబిరంలో మాజీ ఎంపీ బీబీ పాటిల్, జిల్లా బీజేపీ అధ్యక్షురాలు అరుణతార పాల్గొన్నారు. ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన వచ్చిందని అరుణతార పేర్కొన్నారు. తుకారాం, తుల సంతోష్, కృష్ణా పటేల్, యాదవ్ రావ్ పాల్గోన్నారు.