calender_icon.png 29 November, 2025 | 2:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌లో చేరిన అయిజ మాజీ ఎంపీపీ

29-11-2025 12:57:57 AM

అలంపూర్, నవంబర్ 28: స్థానిక సంస్థల ఎన్నికల వేళ అలంపూర్ పరిధిలో బిఆర్‌ఎస్ పార్టీకి షాక్ తగిలింది .ఆ పార్టీకి చెందిన పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు ఒక్కొక్కరు  కాంగ్రెస్ గూటికి  చేరుతున్నారు. ఇటీవలే అయిజకు బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన పలువురు కీలక  మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అదే దారిలోనే శుక్రవారం అయిజ మండల తాజా మాజీ ఎంపీపీ ప్రహల్లాద  రెడ్డి కూడా బిఆర్‌ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

ఈ మేరకు హైదరాబాద్ లోని ఎఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ ను కలిసి వారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు సంపత్ కుమార్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా  సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో అభివృద్ధి సంక్షేమానికి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంలో పూర్తి చేస్తామని తెలిపారు. వీరి వెంట ఆర్డీఎస్ మాజీ చైర్మన్ తనగల సీతారామరెడ్డి, మురారి సోమ శేఖర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దీపక్ ప్రజ్ఞా ఉన్నారు.