calender_icon.png 29 November, 2025 | 2:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్లమ్మకు దక్కిన అదృష్టం

29-11-2025 12:58:41 AM

రిజర్వేషన్ రూపంలో వరించిన సర్పంచ్ పదవి

మహబూబాబాద్, నవంబర్ 28 (విజయక్రాంతి): రిజర్వేషన్ల ఫలితంగా గ్రామంలో ఉన్న ఒక్క ఓటర్‌కు సర్పంచ్ పదవి లభించనుంది. వరంగల్ జిల్లా సంగెం మండలం ఆశాలపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవిని రిజర్వేషన్ల కారణంగా ఈసారి ఎస్సీ మహిళకు కేటాయించారు. గ్రామంలో 1,600 మంది ఓటర్లు ఉండగా ప్రస్తుతం గ్రామంలో మల్లమ్మ ఒక్కరే నివసిస్తుండడంతో ఆమెను సర్పంచు పదవికి గ్రామస్తులంతా ప్రతిపాదించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మల్లమ్మ 30 ఏళ్ల క్రితం జీవనోపాధి నిమిత్తం కుటుంబంతో కలిసి ఆశలపల్లికి వలస వచ్చింది. కుమార్తెలకు వివాహం జరిపించి అత్తగారింటికి పంపించగా భర్త ఇటీవలే మరణించాడు. నిరుపేదరాలైన వలస కూలి కాస్త ఇప్పుడు ఆ గ్రామానికి ప్రథమ పౌరురాలిగా పదవి బాధ్యతలు చేపట్టే అవకాశం దక్కిందని చెబుతున్నారు.